నిర్మల్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం ఓ మహిళ 5.5 కిలోల బరువు కలిగిన మగశిశువుకు జన్మనిచ్చింది. సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామానికి చెందిన నేహా అనే మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది.
5.5 కిలోల శిశువు జననం... తల్లీబిడ్డ సురక్షితం - నిర్మల్ జిల్లా వార్తలు
నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాల భీముడు జన్మించాడు. మంగళవారం ఓ మహిళ 5.5 కిలోల బరువు కలిగిన మగశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.
bala bheemudu
సాధారణ కాన్పునకు వీలుకాకపోవడం వస్స వైద్యులు రాజేందర్, సరోజ, మమత శస్త్రచికిత్స చేశారు. 5.5 కిలోల బరువుతో పండంటి మగబిడ్డ పుట్టాడు. పసికందు ఇంత బరువుతో జన్మించటం అరుదని.. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్కు హైకోర్టు నోటీసులు
Last Updated : Jun 24, 2020, 4:27 PM IST