తెలంగాణ

telangana

ETV Bharat / state

బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేత - Babli project updates

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఈరోజు అధికారులు మూసివేశారు. ఏటా గేట్లు ఎత్తివేత, మూసివేత ప్రక్రియను కేంద్ర జల సంఘం అధికారుల పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.

బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేత

By

Published : Oct 29, 2019, 6:57 PM IST

గోదావరి నదిపై ఎగువన ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఈరోజు సీడబ్ల్యూసీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర అధికారులు కలసి 14 బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏటా జులై 1న గేట్లు తెరిచి అనంతరం అక్టోబర్ 28న మూసివేస్తారు. ఒకవేళ బాబ్లీ ప్రాజెక్టులో నీరు అధికమైతే గేట్లు తెరచి కొన్ని టీఎంసీలు గోదావరిలో వదులుతారు. ఏటా గేట్లు ఎత్తివేత, మూసివేత ప్రక్రియను కేంద్ర జల సంఘం అధికారుల పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.

బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేత

ABOUT THE AUTHOR

...view details