నిర్మల్ జిల్లా బాసర దగ్గరలో గోదావరి నదిపై ఎగువన ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను గురువారం సీడబ్ల్యూసీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులు కలిసి మూసివేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏటా జులై 1న గేట్లు తెరిచి..అక్టోబర్ 28న మూసివేస్తారు.
బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేసిన అధికారులు - బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేత
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అధికారులు మూసివేశారు. ఏటా జులై 1న గేట్లు ఎత్తి.. అక్టోబర్ 28న మూసివేస్తారు. ఈ ప్రక్రియను కేంద్ర జల సంఘం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.
బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేసిన అధికారులు
ఒకవేళ బాబ్లీ ప్రాజెక్టులో నీరు అధికమైతే గేట్లు తెరచి కొన్ని టీఎంసీలు గోదావరిలోకి వదులుతారు. ఏటా గేట్లు ఎత్తివేత, మూసివేత ప్రక్రియను కేంద్ర జల సంఘం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:అల్లుడిని హత్య చేసిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం!