నిర్మల్లో అయ్యప్ప పడిపూజ వైభవంగా జరిగింది. భక్తి గీతాలు, భజనలతో ఆలయం కనువిందుగా మారింది.
నిర్మల్లో వైభవంగా అయ్యప్ప పడిపూజ
By
Published : Jan 2, 2020, 10:04 AM IST
నిర్మల్లో వైభవంగా అయ్యప్ప పడిపూజ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవిమాత ఆలయంలో ధర్మశాస్త అయ్యప్ప సన్నిదానం విఘ్నేశ్వర గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. గణపతి, సుబ్రమణ్య స్వామి, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పడి పూజలో స్వాముల భక్తి గీతాలు, భజన స్థానికులను ఆకట్టుకున్నాయి. అయ్యప్పకు చేసిన అభిషేకం స్వాములకు, భక్తులకు కనువిందు కలిగించింది.