నిర్మల్ జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆయుధ కర్మాగారంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసు వాహనాలకు సైతం ప్రత్యేకంగా పూజలు జరిపారు.
'ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలి' - nirmal district latest news
ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో దసరా పండుగను నిర్వహించుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు ఎస్పీ రాంరెడ్డి కోరారు. విజయదశమిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు.
ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలి: ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా పోలీసులు, ప్రజలకు అదనపు ఎస్పీ రాంరెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయాలకు ప్రతీకగా విజయదశమిని అభివర్ణించారు. ప్రజలంతా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి..పెద్దల నిబంధనకు కట్టుబడి.. పండుగలు చేసుకోని ఓ గ్రామం