తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కు ధరించకపోతే జరిమానా: ఏఎస్పీ రాంరెడ్డి - కరోనా కట్టడి చర్యలపై నిర్మల్​ ఏఎస్పీ ప్రెస్ మీట్

నిర్మల్ జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున కొవిడ్ కట్టడి చర్యలను మరింత కఠినతరం చేశారు. మాస్కు ధరించకుండా బయటకు వచ్చినవారికి రూ. వేయి జరిమానా విధించనున్నట్లు ఏఎస్పీ రాంరెడ్డి వెల్లడించారు.

asp ramreddy about corona rules and regulations
మాస్కు ధరించకపోతే రూ. వేయి జరిమానా: ఏఎస్పీ రాంరెడ్డి

By

Published : Aug 11, 2020, 7:05 PM IST

కొవిడ్- 19 నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించకపోతే జరిమానాలు తప్పవని నిర్మల్ జిల్లా ఏఎస్పీ రాంరెడ్డి హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది ఆయన తెలిపారు. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటకి రావాలని.. అలా బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని ఏఎస్పీ సూచించారు.

మాస్కు ధరించని వారికి రూ. వేయి జరిమానా విధించనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. కరోనా వ్యాధిగ్రస్థుల పట్ల సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని వెల్లడించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాంరెడ్డి సూచించారు.

ఇదీ చూడండి:హైదరాబాద్​కు 200 టన్నుల అమోనియం నైట్రేట్​!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details