మాల్లోని విభిన్న రకాల చీరలను ప్రదర్శించి ముద్దుగుమ్మ సందడి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యాటక ప్రాంతానికి అనుకూలంగా ఉందని అనుపమ తెలిపారు. రాబోయే రోజుల్లో సినిమా షూటింగులు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనుపమ వస్తుందని తెలుసుకున్న అభిమానులు మాల్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అందాల తారను చూసేందుకు బారులు తీరారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Anupama Parameswaran: నిర్మల్‌లో కర్లీ బ్యూటీ అనుపమ సందడి - Anupama Parameswaran new movies
నిర్మల్ జిల్లా కేంద్రంలో సినీనటి అనుపమ సందడి చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ మాల్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనుపమను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Anupama Parameswaran started kisan fashion mall in nirmal