హైదరాబాద్ పంజాగుట్ట వద్ద అంబేడ్కర్ విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్పై షెడ్యూల్డ్ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3 కారణంగానే తెలంగాణ సాధ్యమైందని నాయకులు తెలిపారు. విగ్రహం తొలగించినా నేటికి ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పంజాగుట్ట వద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
'బాబాసాహెబ్ విగ్రహాన్ని పున ప్రతిష్ఠించాలి' - TANK BUND
రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని షెడ్యూల్డ్ సంఘాల నాయకులు తెలిపారు. పంజాగుట్ట వద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసిన షెడ్యూల్డ్ నాయకులు