ప్రవీణ్ కుమార్ ఉన్నతమైన స్థానంలో ఉండి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని నిర్మల్ జిల్లా భాజపాఅధ్యక్షురాలు రమాదేవి అన్నారు. విద్యార్థులను ఉన్నతమైన స్థాయికి తీర్చిదిద్దే గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని పేర్కొన్నారు.
'హిందు దేవుళ్లను కించపరిచేలా ప్రవీణ్ మాట్లాడటం బాధాకరం' - Nirmal district latest news
నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. హిందు దేవుళ్లను కించపరిచేలా ప్రవీణ్ మాట్లాడటం బాధాకరమని పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. దేవుళ్లను పూజించొద్దని ప్రతిజ్ఞ చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం
రాముడు, కృష్ణుడు, గౌరీ, వినాయకున్ని పూజించబోమని ప్రతిజ్ఞ చేయడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్బ్యాండ్ వద్ద అంబెడ్కర్ విగ్రహానికి దళిత మోర్చా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మత విశ్వాసాలను కించపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:నాలుగోరోజు శ్రీకృష్ణావతారంలో యాదాద్రీశుడు