నిర్మల్ పట్టణంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగున్నర దశాబ్దాల క్రితం (1975-81 మధ్య) చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. ఉన్నత స్థితిలో ఉన్న వారంతా తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు.
అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
చదువుకునే వయసులో ఏరా, ఒరేయ్ అనుకున్నారు. చదువులు ముగిశాక ఎవరి వ్యాపకాల్లో వారు మునిగిపోయారు. పెళ్లి, కుటుంబ బాధ్యతలతో బిజీగా మారి జీవితంలో స్థిరపడ్డారు. వృద్ధాప్యదశకు చేరువయ్యారు. ఇన్నాళ్లు దూరమైన స్నేహబంధాన్ని మరోసారి కళ్లముందు చూడాలనుకున్నారు. ఆలోచనను ఆచరణలో పెట్టారు. దాదాపు నాలుగున్నర దశబ్దాల అనంతరం తిరిగి ఒక్కచోట కలుసుకున్నారు.
అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఈ పూర్వ విద్యార్థులు సతీసమేతంగా... గురు దంపతుల పాదాలు కడిగి తమ కృతజ్ఞత చాటుకున్నారు. అనంతరం సామూహిక భోజనాలు చేసి... సంతోషంగా గడిపారు.
ఇదీ చూడండి:'అతివల విజయాలకు ప్రతీకగా మహిళా దినోత్సవం'