రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అనేక రోడ్ల అభివృద్ధికి నిధులను కేసీఆర్ విడుదల చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగాం నుంచి లింబా(బి) గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన అల్లోల - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వార్తలు
భైంసా మండలం మాటేగాం నుంచి లింబా(బీ) గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సోయం, ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ.9 కోట్ల 66 లక్షల 73 వేల నిధులతో 13 కిలోమీటర్ల రోడ్డు పనులను చేపట్టారు.
రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన అల్లోల
రూ.9 కోట్ల 66 లక్షల 73 వేల నిధులతో 13 కిలోమీటర్ల రోడ్డు పనులను ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా చేపట్టారు. కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో డొమెస్టిక్ ఎయిర్పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి'
Last Updated : Dec 13, 2020, 8:31 AM IST