నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు. అకారణంగా రైతుల ఖాతాల నుంచి ధాన్యం డబ్బుల చెల్లింపులో కోతలు విధించారని ఆందోళన చేశారు. మండలంలోని ఒకే గ్రామానికి చెందిన రైతుల ఖాతాల నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు కోత విధించారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
వెంటనే కోత విధించిన డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 3గంటల పాటు ధర్నా చేపట్టారు. రైతుల వద్దకు చేరుకున్న తహసీల్దార్ వారిని వారం పాటు గడువు కోరడం వల్ల ధర్నాను విరమించుకున్నారు. వారం రోజుల్లో న్యాయం జరగక పోతే జాతీయ రహదారిపై ధర్నా చేపడతామని రైతులు హెచ్చరించారు.
70 వేలు కోత విధించారు..
వరి ధాన్యం 685 బస్తాలు కాగా.. 100 బస్తాలకు చెల్లించే డబ్బులు దాదాపు 70వేల రూపాయలు కోత విధించారు. ఎక్కడ జాప్యం జరిగిందో, ఎవరిని అడగాలో అర్థం కానీ పరిస్థితి ఉంది.