తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ - నిర్మల్​ జిల్లా తాజా వార్త

నిర్మల్​ జిల్లా కోర్టుకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్​ ఓవైసీ హాజరయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా కేసును హైదరాబాద్​ నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని ఓవైసీ అభ్యర్థించగా.. తదుపరి విచారణకు నాంపల్లి కోర్టులో హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది.

akbharuddin-attend-nirmal-court
నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ

By

Published : Dec 10, 2019, 3:33 PM IST

నిర్మల్​ జిల్లా కోర్టుకు ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్​ ఓవైసీ హాజరయ్యారు. 24 డిసెంబరు 2012న నిర్మల్​ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో హిందూ దేవతలను కించపరుస్తూ, మత విద్వేషాలను రెచ్చ గొట్టేలా.. విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో ఆయన ఈ రోజు కోర్టులో హాజరయ్యారు. ఇదే కేసులో నిర్మల్​కు చెందిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అజీంబీన్ యాహియా కూడా కోర్టుకు వచ్చారు.
ఇన్​ఛార్జ్​ జూనియర్ అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్​క్లాస్ మెజిస్ట్రేట్ జస్టిస్​ రామలింగం ఎదుట హాజరై తన న్యాయవాది సహాయంతో ఓవైసీ వాదనలు వినిపించారు. అనారోగ్య కారణాలరీత్యా కేసును హైదరాబాద్​లోని నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు కేసును అక్కడి కోర్టుకు బదిలీ చేశారు.
ఓవైసీ కోర్టుకు హాజరవుతున్న వేళ ముందు జాగ్రత్తగా నిర్మల్ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ

ABOUT THE AUTHOR

...view details