నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.7,500 చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్.ఎన్ రెడ్డి కోరారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ - etv bharath
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.7,500 చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్.ఎన్ రెడ్డి డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ
కార్మికులందరికీ హెల్త్, పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించొద్దని కోరారు. కార్మికుల వేచి ఉండే స్థలాల్లో విశ్రాంతి షెడ్డులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:అపార్ట్మెంట్లో పగిలిన మంజీరా పైప్లైన్.. నదిని తలపించిన సెల్లార్