తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2021, 7:39 PM IST

ETV Bharat / state

పెంచిన హమాలీ రేట్లను అమలు చేయాలి: ఏఐటీయూసీ

నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సివిల్ సప్లై కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెంచిన హమాలీ రేట్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

AITUC dharna in nirmal collectorate for wage rates
పెంచిన హమాలీ రేట్లు అమలు చేయాలని ధర్నా

పెంచిన హమాలీ రేట్లకు సంబంధించిన జీఓను విడుదల చేసి వెంటనే అమలు చేయాలని నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సివిల్ సప్లై కార్మికులు ధర్నా చేపట్టారు. బస్తాకు రూ.23 కూలీ, పీఎఫ్, ఈఎస్ఐ వైద్య సౌకర్యం, పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్, బోనస్ కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జీఎస్ నారాయణ డిమాండ్​ చేశారు.

ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, యూనియన్ ప్రతినిధుల మధ్య కిందటి ఏడాది నవంబర్​లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. రెండు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు జీవో విడుదల కాకపోవడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయాలని అన్నారు.

ఇదీ చదవండి: రైతులపై రాష్ట్ర ప్రభుత్వానిది మొసలి కన్నీరు: పొన్నం

ABOUT THE AUTHOR

...view details