నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ద్వారాలను అర్చకులు తెరిచారు. సూర్యగ్రహణం సందర్భంగా మూసివేసిన అమ్మవారి ఆలయాన్ని గోదావరి నీటితో ఆలయ సిబ్బంది శుభ్రపరిచారు. సంప్రోక్షణ అనంతరం రుత్వికులు వేదమంత్రోచ్ఛారణలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. పుణ్యాహవాచనం, గణపతి పూజ, కలశ పూజ, కుంకుమార్చన, హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెరుచుకున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం - బాసరలో సూర్యగ్రహణం
సూర్యగ్రహణం సందర్భంగా మూసివేసిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ద్వారాలను అర్చకులు తెరిచారు. సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![తెరుచుకున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం After solar eclipse basara temple reopened](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7711842-469-7711842-1592739510472.jpg)
తెరుచుకున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం