తెలంగాణ

telangana

ETV Bharat / state

'35 ఏళ్లుగా పన్ను చెల్లిస్తున్నా.. సమస్యలు పరిష్కరించలేదు' - chakirevu villagers problems

గ్రామంలో విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్​లో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. 35 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా.. తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

adivasi protest in nirmal district
నిర్మల్​ జిల్లాలో ఆదివాసీల ఆందోళన

By

Published : Sep 22, 2020, 6:14 PM IST

నిర్మల్ జిల్లా పెంబి మండలం దోందరి గ్రామ పంచాయతీ పరిధిలోని చాకిరేవు గ్రామంలో విద్యుత్​తో పాటు, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టరేట్​లో వినతి పత్రం సమర్పించారు.

35 ఏళ్లుగా గ్రామ పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కరించలేదని చాకిరేవు గ్రామస్థులు వాపోయారు. తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల హక్కు పత్రాలు కూడా ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details