తెలంగాణ

telangana

ETV Bharat / state

ఛత్రపతి ఆశయ సాధనకు యువత కృషి చేయాలి: ఎంపీ సోయం - నిర్మల్‌లో ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు పూలమాల వేసి నివాళులర్పించారు.

shivaji birth anniversary, nirmal
నిర్మల్‌, ఛత్రపతి శివాజీ జయంతి

By

Published : Feb 19, 2021, 1:41 PM IST

హిందూముస్లిం అని తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని ఆదిలాబాద్ ఎంపీ సాయం బాపురావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో భాజపా ఆధ్వర్యంలో శివాజీ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ చేసిన యుద్ధాలతో హిందూ సమాజానికి ఎంతో మేలు జరిగిందని ఎంపీ పేర్కొన్నారు.

శివాజీ.. తన రాజ్యంలో ముస్లింలకు, మజీదులకు ఎలాంటి హాని వాటిల్లకుండా కాపాడుకున్న గొప్ప వీరుడని సోయం బాపురావు కొనియాడారు. ఆయన సైన్యంలో ఒక ముస్లింను సైన్యాధిపతిగా నియమించారని తెలిపారు. ఛత్రపతి ఆశయ సాధనలో యువత నడవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు రమాదేవి, అయ్యన్నగారి భూమయ్య, రాంనాథ్, గణేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ మృతి

ABOUT THE AUTHOR

...view details