రాష్ట్రంలో కరోనా రెండో దశ ప్రభావం ఉద్ధృతంగా ఉన్నందున ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కోహెడ, బస్వాపూర్, గుండారెడ్డిపల్లి గ్రామాల్లో సర్వే చేపట్టారు. గ్రామాల్లో దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నట్లయితే... పేరు నమోదు చేసుకొని అవసరమైన మందులను పంపిణీ చేశారు. వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామాల్లో చురుగ్గా ఇంటింటి సర్వే - telangana news
సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే అవసరమైన మందులను అందజేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైరస్‌పై అవగాహన కల్పించారు.
![గ్రామాల్లో చురుగ్గా ఇంటింటి సర్వే Active household survey in villages, nirmal district Active household survey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:53:29:1620390209-tg-krn-101-07-jvaram-sarvey-av-ts10085-07052021174643-0705f-1620389803-508.jpg)
ఇంటింటి సర్వే, సిద్దిపేట జిల్లాలో గ్రామాల్లో ఇంటింటి సర్వే
స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా అందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి, సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, సర్పంచ్ పేర్యాల నవ్య, సింగిల్ విండో ఛైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, ఎంపీటీసీ ఖమ్మం స్వరూప, సర్పంచ్ అశోక్ రెడ్డి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.