తెలంగాణ

telangana

పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతి అభివృద్ధి పనుల పురోగతిపై నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్మశానవాటికలు, పంట కల్లాల నిర్మాణాలు తరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Dec 1, 2020, 9:15 PM IST

Published : Dec 1, 2020, 9:15 PM IST

Actions in case of negligence in rural works says nirmal dist Collector
పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచాలని నిర్మల్​ జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్మశాన వాటికలు, పంట కల్లాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకు ప్రభుత్వం 2510 కల్లాలను కేటాయించిందని...ఇప్పటికే 810 చోట్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.

పనుల్లో పురోగతిపై అధికారులు ప్రతిరోజు పర్యవేక్షించాలని తెలిపారు. శ్మశానవాటికల్లో ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని వెల్లడించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు పాలనాధికారి హేమంత్​ బోర్కడే, జిల్లా పంచాయతీరాజ్​శాఖ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు

ABOUT THE AUTHOR

...view details