ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించడం కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ కిరణ్ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలోని కుంటా ఏరియాలో తనిఖీలు జరిపామని పేర్కొన్నారు. ఈ సోదాల్లో 100 మంది పోలీసులు పాల్గొన్నారని వెల్లడించారు.
'నేరాల నియంత్రణకు నిర్బంధ తనిఖీలు' - Carden search in Bhainsa
నేరాల నియంత్రణ కోసం నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ కిరణ్ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించారు.
భైంసాలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన ఏసీపీ కిరణ్
ఈ నిర్బంధ తనిఖీల్లో భారీగా వాహనాలు సీజ్ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పాత్రలు లేని 83 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:వరుణ్ పెళ్లిపై నెటిజన్ కామెంట్.. నాగబాబు కౌంటర్!