కరోనా కాలంలో ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్న పాఠశాలలు, కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ చంద్రగిరి డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని పేర్కొన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.
విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: ఏబీవీపీ - nirmal district latest news
విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ చంద్రగిరి ఆరోపించారు. పల్లెలకు విస్తరిస్తున్న కార్పొరేట్ కళాశాల మాఫియాను వెంటనే అరికట్టాలని అన్నారు.
విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: ఏబీవీపీ
ఇంటర్ బోర్డు అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని కోరారు. పల్లెలకు విస్తరిస్తున్న కార్పొరేట్ కళాశాల మాఫియాను వెంటనే అరికట్టాలని అన్నారు.
ఇదీ చూడండి:'ప్రజా ప్రతినిధులు మీరే ఇలా ఉంటే... సామాన్యులు ఎలా పాటిస్తారు?'