కరోనా మహమ్మారి విజృంభనతో పల్లెసీమలు వణికిపోతున్నాయి. గత సంవత్సరం పట్టణాల్లో వైరస్ సోకి మరణాలు సంభవించినా… పల్లెల్లో ఆ తీవ్రత అంతగా కనిపించలేదు. రెండోదశలో కరోనా గ్రామీణ ప్రాంత ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. నిర్మల్ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో కరోనా మరణాలు పెరగ్గా.. గ్రామాల పెద్దలు తీర్మానాలు చేసి స్వచ్ఛందంగా లాక్డౌన్ విధిస్తున్నారు. ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు నిత్యావసర వస్తువుల కోసం కిరాణా దుకాణాలకు, కూరగాయలకు వెసులుబాటు కలిగిస్తున్నారు.
కిట్ల కరోత.. కరోనా పరీక్షల కోసం చెప్పుల వరుస - Corona tests in nirmal
నిర్మల్ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో కరోనా మరణాలు పెరగగా గ్రామాల పెద్దలు తీర్మానాలు చేసి స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధిస్తున్నారు. ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు నిత్యావసర వస్తువుల కోసం కిరాణా దుకాణాలకు, కూరగాయలకు వెసులుబాటు కలిగిస్తున్నారు.
కరోనా నిర్ధరణ పరీక్షకు ఆసుపత్రుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. నిర్మల్ మండలంలోని ముజ్గి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు పాదరక్షలు వరుసలో ఉంచారు. ఎవరి పాదరక్షలను బట్టి వారు వరుస క్రమంలో పరీక్షలు చేయించుకుంటున్నారు. వివిధ గ్రామాల నుంచి కరోనా పరీక్షల కోసం ఎక్కువ సంఖ్యలో వస్తుండగా… పీహెచ్‌సీలో కిట్ల లభ్యతను బట్టి పరీక్షలు చేస్తున్నారు. తమ వంతు వచ్చేసరికి పరీక్షలు ముగుస్తుండటంతో కొందరు వెనుదిరగాల్సి వస్తోంది. కిట్లను తగినంత అందుబాటులో ఉంచి పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.