తెలంగాణ

telangana

ETV Bharat / state

కానిస్టేబుల్ ఔదార్యం... తలసేమియా చిన్నారికి రక్తదానం - తలసేమియా వ్యాధిగ్రస్తులకు పోలీసుల సాయం

కరోనా నేపథ్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల బాధలు వర్ణనాతీతం.. రక్తం దొరక్క, దాతలు ముందుకురాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా నిర్మల్​ జిల్లాలో పసిప్రాయం నుంచే ఆ వ్యాధితో బాధపడతోన్న ఓ చిన్నారికి సంతోశ్​కుమార్​ అనే కానిస్టేబుల్​ సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.

కానిస్టేబుల్ ఔదార్యం... తలసేమియా చిన్నారికి రక్తదానం

By

Published : Sep 5, 2020, 6:46 AM IST

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం అష్టా గ్రామానికి చెందిన భరత్ చిన్న వయస్సులోనే తలసేమియా వ్యాధి బారినపడ్డాడు. అతనికి నెలకోసారి రక్తాన్ని ఎక్కించాలి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చారు. స్థానిక బ్లడ్ బ్యాంక్​లో రక్త నిల్వలు లేకపోవడం, కరోనా నేపథ్యంలో రక్తదాతలు ముందుకు రాకపోవడం వల్ల ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాధితునికి ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వాట్సప్ గ్రూప్​లో పోస్ట్ చేశారు.

దానికి వెంటనే స్పందించిన పోలీస్ కానిస్టేబుల్ సంతోశ్​ కుమార్ ఆన్ డ్యూటీలో వచ్చి రక్తదానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. తలసేమియా బాధితులకు రక్తం దొరకడం కష్టంగా మారిందని, చిన్నారుల జీవితాలు నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కానిస్టేబుల్ విజ్ఞప్తి చేశారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడడానికి సాయం చేసిన సంతోశ్​కు భరత్​ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ సహించదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details