తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. నేరానికి శిక్ష పడినప్పుడే వాటిని నివారించగలమని పేర్కొన్నారు.
శిక్షలు పడినప్పుడే నేరాలు తగ్గుతాయి - నిర్మల్ తాజా వార్తలు
నేర రహిత సమాజం నిర్మించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కోర్టు డ్యూటీ అధికారులు, పీపీలను ఘనంగా సన్మానించారు.
నిర్మల్లో పోలీసుల అభినందన సభ
జిల్లా పరిధిలో జనవరి నెలలో మూడు నేరాల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేరాలను మరింత త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.