బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఓ ముస్లిం యువకుడు దర్శించుకున్నారు. హైదరాబాద్కు చెందిన యువ గాయకుడు షేక్ ఇందాద్ అలీ గురువారం బాసరకు వచ్చారు. హారతి సమయంలో అమ్మవారిని అర్చిస్తూ పాటలు ఆలపించాడు.
జ్ఞానసరస్వతి ఆలయంలో ముస్లిం భక్తుడి గానం - basara latest news
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో మత సామరస్యం వెల్లివిరిసింది. సరస్వతి అమ్మవారి ఓ ముస్లిం యువకుడు దర్శించుకుని హారతి సమయంలో అమ్మవారి అర్చిస్తూ పాటలు పాడాడు.
జ్ఞానసరస్వతి ఆలయంలో ముస్లిం భక్తుడు గానంA Muslim devotee singing at the Gnanasaraswati Temple
తాను ముస్లిం అయినా చదువుల తల్లిని కొలుస్తానని, తనకు గాత్రం అమ్మవారు ఇచ్చిన వరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, భక్తులు అలీని అభినందించారు.