నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన శ్రీధర్ మూడేళ్లుగా క్రితం ఉపాధి నిమిత్తం ఒమన్ దేశం వెళ్లారు. ఈనెల 4న గుండెపోటుతో మరణించారు. అతని మృతదేహం కోసం వారం రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూశారు.
ఒమన్‌లో నిర్మల్ జిల్లా వాసి మృతి.. స్వగ్రామానికి చేరిన మృతదేహం - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
ఉపాధి నిమిత్తం ఒమన్ దేశం వెళ్లిన నిర్మల్ జిల్లా వడ్యాల్ గ్రామానికి చెందిన మాలెపు శ్రీధర్ (38) అక్కడే మృతి చెందారు. అతని మృతదేహం శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరింది.
ఒమన్‌లో నిర్మల్ జిల్లా వాసి మృతి.. స్వగ్రామానికి చేరిన మృతదేహం
ఉపాధి నిమిత్తం వడ్యాల్ గ్రామం నుంచి వెళ్లిన వారితోపాటు మృతుని స్నేహితులు మృతదేహాన్ని అక్కడి నుంచి ఇండియాకు తరలించేందుకు కృషి చేశారు. వారం రోజుల్లోనే పంపించేలా ఏర్పాట్లు చేశారు. శ్రీధర్ మృతదేహం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్సులో సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి: RTC: జీతాల కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులు