తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​ జిల్లాలో.. రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ - fundraising drive has been launched at the Nirmal district

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. హిందువాహిని, భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

A fundraising drive has been launched at the Nirmal district headquarters for the design of the Ram Mandir structure in Ayodhya.
నిర్మల్​ జిల్లాలో.. రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

By

Published : Jan 20, 2021, 4:11 PM IST

నాలుగున్నర లక్షల రామభక్తుల త్యాగం ఫలితంగానే రామమందిర నిర్మాణం జరగబోతుందని కృష్ణ, గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ పేర్కొన్నారు.

భారీ వ్యయంతో..

నిర్మల్ జిల్లా కేంద్రంలో రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హిందువాహిని, భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు పదిహేను వందల కోట్ల వ్యయంతో మందిర నిర్మాణం జరుగుతుందని తెలిపిన ఆయన.. 2023 సంవత్సరం నాటికి ఈ నిర్మాణం పూర్తి కాబోతుందని తెలిపారు.

ఇదీ చదవండి:భద్రతాదళాలే లక్ష్యంగా 30 కిలోల మావోయిస్టుల మందుపాతర

ABOUT THE AUTHOR

...view details