రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ పత్తి విత్తనాలు విక్రయించిన ఏజెన్సీపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దుర్గం నూతన్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కుస్లి గ్రామానికి చెందిన గుంజాల శెట్టిభ అనే కౌలు రైతుతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
శెట్టిభ తన సొంత 5 ఎకరాలతో పాటు 18 ఎకరాలను కౌలుకు తీసుకొని మొత్తం 23 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. నాలుగు నెలలు దాటుతున్నా పూత లేకపోవడంతో ఆందోళన చెంది బీటీ పత్తి విత్తనాలు విక్రయించిన ఏజెన్సీను నిలదీయగా పట్టించుకోవడం లేదని సంబంధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.