నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి 150 సంవత్సరాల వృక్షం నేలకూలింది. చెట్టు పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ తీగలపై పడటం వల్ల దాదాపు ముధోల్, బిద్రేల్లి సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 14 గ్రామాలకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలో నేలకొరిగిన 150 ఏళ్ల మహా వృక్షం
ఎడతెరిపి లేని వర్షాలకు 150 సంవత్సరాల చరిత్ర గల ఓ మహావృక్షం నిర్మల్ జిల్లాలో నేలకూలింది. చెట్టు... పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడటం వల్ల 14 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపోయింది.
నేలకొరిగిన 150 సంవత్సరాల వృక్షం