తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్ జిల్లాలో కరోనా విలయతాండవం... 8 కొత్త కేసులు నమోదు - corona cases in nirmal

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాల్లో సైతం కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్మల్​ జిల్లాలో కొత్తగా మరో 8 పాజిటివ్​ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

8 new corona cases in nirmal district
నిర్మల్ జిల్లాలో కరోనా విలయతాండవం... 8 కొత్త కేసులు నమోదు

By

Published : Jul 19, 2020, 8:51 PM IST

నిర్మల్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. 24 గంటల్లో 18 మంది రక్త నమూనాలు పరీక్షించగా... బైంసా పట్టణానికి చెందిన ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తిక్ వెల్లడించారు. వీటితో కలిపి జిల్లాలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 89కి చేరింది.

జిల్లా వ్యాప్తంగా 1158 మంది రక్త నమూనాలు సేకరించినట్టు అధికారులు పేర్కొన్నారు. వీటిలో 36 యాక్టివ్ కేసులుండగా... ఒక్కరు ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. హోం క్వారంటైన్​లో 35 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో నలుగురు బాధితులు కరోనా మహమ్మారికి బలయ్యారు.

ఇదీ చూడండి:బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details