తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో ఒక్కరోజే 6,265 మందికి టీకా - తెలంగాణ వార్తలు

నిర్మల్​ జిల్లాలో 6,265 మందికి టీకా ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. 45 పైబడిన వారు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

nirmal vaccinations, nirmal district covid vaccination
కరోనా టీకా పంపిణీ, నిర్మల్​లో వ్యాక్సినేషన్

By

Published : Apr 24, 2021, 8:46 PM IST

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శనివారం 6,265 మందికి టీకా ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జిల్లాలోని 23 ప్రభుత్వ ఆస్పత్రులు, 3 ప్రైవేటు ఆస్పత్రులతో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.

జిల్లాలో 45-59 ఏళ్ల వారికి 4,904 మందికి, 60 ఏళ్లు పైబడిన 1,324 మందికి, ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ 37 మందికి టీకా ఇచ్చామని వివరించారు. 45 పైబడిన వారు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:బరువు తగ్గేందుకు రాత్రుళ్లు చపాతీ తింటున్నారా?

ABOUT THE AUTHOR

...view details