నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ మినీ ట్యాంక్‌బండ్ మీద 150 అడుగుల భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నారు. ఆ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ పరిశీలించారు. పట్టణ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. పట్టణమంతా కనిపించేలా ఈ జెండా రూపొందించారు. ఆగష్టు 15 నాటికల్ల నిర్మాణ పనులు పూర్తి చేసి.. పతాకావిష్కరణ చేస్తామని కలెక్టర్ అన్నారు. అనంతరం ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ పీఎం స్వనిధి పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున రుణ సహాయం కోసం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ జాతీయ జెండా ఏర్పాటు - నిర్మల్ జిల్లా వార్తలు
నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద 150 అడుగుల భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. పట్టణమంతా కనిపించేలా జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నామని, ఆగష్టు 15 నాటికల్లా నిర్మాణ పనులు పూర్తి చేసి.. పతాకావిష్కరణ చేస్తామని అన్నారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ జాతీయ జెండా ఏర్పాటు