తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడికి 14రోజుల రిమాండ్​' - nirmal sp

రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్​ను అరెస్ట్​ చేశామని నిర్మల్​ ఎస్పీ శశిధర్​రాజు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయిలు వసూలు చేశారని, డబ్బులు తిరిగివ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఫిర్యాదులపై అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

'సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడికి 14రోజుల రిమాండ్​'

By

Published : Sep 30, 2019, 3:30 PM IST

రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదన్​ను అరెస్ట్​ చేసినట్లు నిర్మల్​ ఎస్పీ శశిధర్​రాజు వెల్లడించారు. కడెం మండలం బెల్లాల్​ గ్రామానికి చెందిన సుధాకర్​ అనే వ్యక్తికి సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని, డబ్బులు తిరిగివ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని ఎస్పీ తెలిపారు. భూవ్యవహారంలోనూ బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈనెల 28న సూర్యాపేటలోని కొత్తపల్లి టోల్​ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. న్యాయస్థానం భూమన్న యాదవ్​కు 14 రోజుల రిమాండ్​ విదించిందన్నారు. ఈయనపై కడెం, ఖానాపూర్​ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదైనట్లు ఎస్పీ శశిధర్​రాజు పేర్కొన్నారు.

'సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడికి 14రోజుల రిమాండ్​'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details