Midday Meals in Government Schools: కూలీ నాలీ చేసుకున్నా రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు లభిస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం చేసే కార్మికుల గౌరవ వేతనం ఎంతో తెలుసా..? రూ.3 వేలు. ఈ నెల 4 వరకూ కేవలం రూ.1000 ఉండేది. ఆ డబ్బులు కూడా 6 నెలలకు ఒకసారి వస్తాయి. ఇంత తక్కువ వేతనంతో తమ కడుపు ఎలా నిండుతుందని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనం వండిపెట్టే మహిళా కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతామని గతేడాది మార్చిలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మాటలు చెప్పి పది నెలల తరువాత శనివారం జీవో జారీ చేశారు. రూ.15 వేల వేతనం ఐతేనే తమకు గిట్టుబాటు అవుతుందని మహిళా కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం తమపైనా దయ చూపాలని మధ్యాహ్న భోజన కార్మికులు వేడుకుంటున్నారు.