నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం నిడుగుర్తి గ్రామానికి చెందిన రుక్మిణి (24) మూడో కాన్పు నిమిత్తం జిల్లా కేంద్రానికి అంబులెన్స్‌లో బయలుదేరించి. నొప్పులు ఎక్కువ కావడం వల్ల మార్గమధ్యలో ఆంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆంబులెన్స్‌లో ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం - woman delivered in an ambulance
కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న గర్భిణి ఆంబులెన్స్‌లోనే ప్రసవించిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో చోటుచేసుకుంది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆంబులెన్స్ సిబ్బంది తెలిపారు.
ఆంబులెన్స్‌లో ప్రసవం
అంబులెన్స్ సిబ్బంది తల్లీబిడ్జలను నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలపగా.. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.