తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎగువ నుంచి జూరాల జలాశయానికి పెరుగుతున్న ఉద్ధృతి - జూరాల జలాశయానికి వరద ఉద్ధృతి

నారాయణపేట జిల్లాలోని జూరాల జలాశయానికి వరద ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో నదీ పరివాహక రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

water flow increasing to jurala project from narayanapur
ఎగువ నుంచి జూరాల జలాశయానికి పెరుగుతున్న ఉద్ధృతి

By

Published : Aug 8, 2020, 4:25 PM IST

నారాయణపేట జిల్లా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 2 లక్షల 20 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు విడుదల చేస్తున్నారు. మాగనూరు, కృష్ణ, మక్తల్ మండలాలలోని నదీ పరివాహక ప్రాంతాల్లో మత్స్యకారులు నదిలోకి వెళ్లరాదని, రైతులు మోటార్లు బయటకు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details