నారాయణపేట జిల్లా కేంద్రంలోని బోయిన్పల్లి తండా పరిసరాల్లోని గుట్టల్లో రెండు చిరుతలు స్థానికులను కలవరపెడుతున్నాయి. తండా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న రెండు చిరుతలు ఆహారం కోసం సంచరిస్తున్న దృశ్యాలను కొందరు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. చిరుతల సంచారానికి సంబంధించిన సమాచారాన్ని ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
బోయిన్పల్లి తండా గుట్టల్లో చిరుతల సంచారం - చిరుతల సంచారం
నారాయణపేట జిల్లాలోని బోయిన్పల్లితండా గుట్టల్లో చిరుతల సంచారంతో తండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతల సంచారాన్ని కొంతమంది యువకులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అధికారులు స్పందించి చిరుతలు బంధించాలని కోరుతున్నారు.
బోయిన్పల్లి తండా గుట్టల్లో చిరుతల సంచారం
ఈ ప్రాంతంలో చిరుతలు లేవని.. దేవరకద్ర, కర్ణాటక ప్రాంతాల అడవుల్లోంచి ఆహారం కోసం చిరుతలు వచ్చి ఉంటాయని అటవీ శాఖ అధికారి నారాయణరావు అభిప్రాయపడుతున్నారు. తండా పరిసరాల్లో చిరుతలా.. హైనాలా అనేది నిర్ధారించాల్సి ఉందని నారాయణరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఇళ్లవద్దే కట్టేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన