ముక్కోటి ఏకాదశి సందర్భంగా నారాయణపేట జిల్లాలోని పలు ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో నిండిపోయాయి. వేకువజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు వరుసలు కట్టారు. దీప, ధూప నైవేద్యాలతో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు.
వైకుంఠ ఏకాదశి రోజున తరించిన భక్తజనం - ముక్కోటి ఏకాదశి వార్తలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశి రోజున తరించిన భక్తజనం
స్వామివారి దర్శించుకునేందుకు ఆలయ ఆధికారులు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, విష్ణు సహస్రనామార్చనలతో భక్తులు తరించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి:ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీ