తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రి ఉంది..డాక్టర్​ లేడు..

నాలుగేళ్ల క్రితం 18లక్షలతో పశు వైద్యశాల నిర్మించారు. కానీ వైద్యుడిని మాత్రం నియమించలేదు. దీంతో ఆ భవనం నిరూపయోగంగా మారింది. వేసవిలో పశువులకు వైద్యం అందిచలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

By

Published : May 18, 2019, 12:44 PM IST

వైద్యుడు లేని ఆసుపత్రి

నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని పెద్ద కడుమూర్​లో నాలుగేళ్ల క్రితం 18 లక్షలతో పశువైద్యశాల నిర్మించారు. కానీ పశువైద్యాధికారి నియామకం జరగలేదు. లక్షలు వెచ్చించి కట్టిన భవనం ఇప్పుడు నిరూపయోగంగా మారింది. పశు వైద్య సేవలు అందక పెద్ద కడుమూర్​తో సహా సమీప గ్రామాల్లో పశుపోషణ రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి వైద్యున్ని నియమించాలని కోరుతున్నారు.

వైద్యుడు లేని ఆసుపత్రి

ABOUT THE AUTHOR

...view details