మొదటి రోజు కొవిడ్ టీకాను 30 మంది వైద్యసిబ్బందికి వేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి టీకాను పీహెచ్సీలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ తీసుకున్నారు.
మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్ పంపిణీ - మక్తల్ కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మొదటిరోజు 30 మంది వైద్యసిబ్బందికి కరోనా టీకాను వేశారు. తొలి వ్యాక్సిన్ను పీహెచ్సీలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ తీసుకున్నారు.
![మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్ పంపిణీ Vaccine distribution at Maktal Government Hospital started by mla ram mohan reddy in narayanpet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10264690-309-10264690-1610795462246.jpg)
టీకా ఇస్తున్న వైద్యసిబ్బంది
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తొలిసారి వైద్యసిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో రోజు కూడా నిబంధనల పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిద్ధప్ప, పార్వతి, రాజ్యలక్ష్మి, శరణ్య, తిరుపతి, వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కరోనాకు చరమగీతం పాడేందుకే వాక్సిన్: సబితా ఇంద్రారెడ్డి