తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేటలో ఉగాది పంచాంగ శ్రవణం - కలెక్టర్​

కొత్తగా ఏర్పడిన జిల్లా నారాయణపేటలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్​ దంపతులు పాల్గొన్నారు. 12 రాశుల వారి రాశిఫలాలను శాంతానంద పురోహిత్​ వివరించారు.

నారాయణపేటలో ఉగాది పంచాంగ శ్రవణం

By

Published : Apr 6, 2019, 8:33 PM IST

నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్​.వెంకట రావు దంపతులు హాజరయ్యారు. కష్ట కాలంలో అందరూ కలిసి కట్టుగా ఉండాలని పాలనాధికారి ఆకాంక్షించారు. వికారి నామ సంవత్సరంలో 12 రాశుల వారి శుభాశుభ ఫలితాలను శాంతానంద పురోహిత్​ పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం ఉగాది పచ్చడి పంచారు. నారాయణపేట జిల్లా ఏర్పడిన తర్వాత అధికారికంగా జరిగిన ఈ కార్యక్రమం వల్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

నారాయణపేటలో ఉగాది పంచాంగ శ్రవణం

ABOUT THE AUTHOR

...view details