నారాయణపేట జిల్లా ఊట్కూరులో 200 మంది పోలీసులతో వినాయక నిమజ్జనం, మొహర్రం పండుగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన ఉట్కూర్‌లో సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులు గణేష్ నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె పలు సూచనలు చేశారు.
నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసులు విధులు నిర్వర్తించే సమయంలో సంయమనం పాటించాలన్నారు. ఎక్కడ డ్యూటీ అయితే అక్కడే ఉండి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, పికెట్స్, పెట్రోలింగ్, మండపాల దగ్గర మొదలగు విధులు నిర్వర్తించే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.