తెలంగాణ

telangana

ETV Bharat / state

కాసేపట్లో గమ్యం చేరుతామనే లోపే కబళించిన మృత్యువు - ఆర్టీసీ బస్సు, బైక్​ రోడ్డు ప్రమాదం

సెలవులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో చేరేందుకు ఇంటి నుంచి ప్రయాణమై.. కాసేపట్లో విధుల్లో చేరుతాననే సమయంలో ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. బాధితుడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TSRTC Bus, Bike Accident at Athmakur in Mahabubnagar district
కాసేపట్లో గమ్యం చేరుతామనే లోపే కబళించిన మృత్యువు

By

Published : Jul 6, 2020, 7:19 PM IST

నారాయణపేట జిల్లా కోస్గి మండలానికి చెందిన ఇలియాస్ అనే వ్యక్తి వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్​నగర్​లో నివాసముంటున్న ఆయన కొన్ని రోజులుగా సెలవుల్లో ఉండి సోమవారం విధుల్లో చేరేందుకు దిచక్రవాహనంపై బయలుదేరారు. ఆత్మకూరు నుంచి మహబూబ్​నగర్​ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతని వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బాధితుడి తలకు తీవ్రంగా గాయాలు కావటం వల్ల అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తోటి ఉద్యోగి మృతి చెందిన విషయం తెలియడం వల్ల ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బాధితుడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details