అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆదరించినట్లే ఎంపీ అభ్యర్థి మల్లె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లాకేంద్రంలో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రతి గడప నుంచి సానుకూల స్పందన వచ్చిందని... ఈ ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మాట నిలబెట్టుకున్న కేసీఆర్‌నే గెలిపిస్తామంటున్నారు - malle srinivas reddy
ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్ అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు తమ డివిజన్‌ను జిల్లా చేస్తానని మాట ఇచ్చి రెండు నెలల్లోగా నిలబెట్టుకున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం
ఇవీ చూడండి: 'నన్ను ఓడించడానికి కాంగ్రెస్, భాజపా కుమ్మక్కు'