కోడింగ్ స్కిల్స్‌లో మక్తల్ విద్యార్థులు సత్తా చాటడం పట్ల టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలా హర్షం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తెలంగాణ ఐటీ అసోసియేషన్ -టీటా అందించిన కోడింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
'స్మార్ట్ ఫోన్ తెలియని దశనుంచి.. కోడింగ్ రాసే స్థాయి వరకు' - తెలంగాణ ఐటీ అసోసియేషన్ వార్తలు
నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా టీటా అందించిన కోడింగ్ శిక్షణ పూర్తయింది. కోడింగ్ స్కిల్స్‌లో మక్తల్ విద్యార్థులు సత్తా చాటడం పట్ల టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలా హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ ఓనమాలు తెలియని దశనుంచి.. విద్యార్థుల్లో కోడ్ రాసే స్థాయి వరకు జరిగిన పురోగతి పట్ల సందీప్ మక్తాలా సంతృప్తి వ్యక్తం చేశారు.
tita
స్మార్ట్ ఫోన్ ఓనమాలు తెలియని దశనుంచి.. విద్యార్థుల్లో కోడ్ రాసే స్థాయి వరకు జరిగిన పురోగతి పట్ల సందీప్ మక్తాలా సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల్లో కొంతమంది సొంతంగా గేమ్స్, యానిమేషన్ రూపకల్పన చేసే దిశగా ఎదిగారని ఆయన పేర్కొన్నారు. తొలుత వనపర్తి, ఇప్పుడు నారాయణపేట జిల్లాల్లో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తామని సందీప్ తెలిపారు.
ఇదీ చదవండి :ఇందూరు ఎమ్మెల్సీ ఉపఎన్నికే లక్ష్యంగా తెరాస వ్యూహాలు