నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామంలోని మిషన్ భగీరథ పనులు జరగనివ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కాంట్రాక్టర్ శివ కుమార్ ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. గ్రామస్థులంతా వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకొని శివకుమార్‌ను ఆత్మహత్య చేసుకోవద్దని వారించారు. మక్తల్ ఎస్సై అశోక్ కుమార్, పోలీస్ సిబ్బంది వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకొని శివకుమార్‌కు నచ్చజెప్పి సమస్యను పరిష్కరిస్తామని అని హామీ ఇచ్చారు. అనంతరం శివ కుమార్ కిందకు దిగాడు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన కాంట్రాక్టర్ - The contractor protested the tank hike
మిషన్ భగీరథ పనులు జరగనివ్వడం లేదని కాంట్రాక్టర్ శివకుమార్ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన కాంట్రాక్టర్