తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) సామాజిక బాధ్యతగా అందుబాటులోకి తీసుకువచ్చిన తొలి ఆన్లైన్ కొవిడ్ ఆసుపత్రిని(covid online hospital) ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వర్చువల్గా ప్రారంభించారు. నారాయణపేటలోని మూగునూరు ప్రభుత్వ పాఠశాలను కరోనా ఆసుపత్రిగా మార్చి.. వైద్య సేవలు అందించనున్నట్లు టీటా(tita) ప్రకటించింది.
covid hospital: ఆన్లైన్ కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన టీటా - తెలంగాణ వార్తలు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా).. పేద ప్రజల కోసం కొవిడ్ ఆన్లైన్ క్లీనిక్ను(covid online hospital) ఏర్పాటు చేసింది. నారాయణపేటలోని మూగునూరు ప్రభుత్వ పాఠశాలను.. కరోనా ఆసుపత్రిగా మార్చి వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలకు ఆన్లైన్ ద్వారా మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు.. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్త్యాల తెలిపారు.
ఆన్లైన్ కొవిడ్ ఆసుపత్రి
అమెరికన్ తెలుగు సొసైటీ సహకారంతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సెంటర్ ద్వారా 56 వేల మందికి లబ్ధి కలగనుందని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్త్యాల తెలిపారు. పీహెచ్సీలో కొవిడ్ నిర్ధారణ అయిన వారు.. ఇక్కడ కొలువుదీరిన వైద్యులతో పాటు, అంతర్జాతీయ వైద్యులతో 'టీ కన్సల్ట్' యాప్ ద్వారా వైద్య సహాయం పొందవచ్చని సందీప్ పేర్కొన్నారు. త్వరలో ఈ సేవలను మరిన్ని జిల్లాలకు విస్తరిస్తామని వివరించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 3,527 కరోనా కేసులు, 19 మరణాలు