నారాయణపేట జిల్లా కృష్ణ నదీతీరంలో 9 ఊర్లను వరద బాధిత గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఊరికో ప్రత్యేక అధికారిని నియమించి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతుండడం వల్ల వాసునగర్, హిందూపూర్, గుర్జాల గ్రామాలను నీరు చుట్టుముట్టాయి. నదీ సమీపానికి ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూపూర్, వాసునగర్, కృష్ణా గ్రామాల వద్ద అధికారులు సమీక్ష నిర్వహించారు. సెలవులు ఉన్నాసరే... అధికారులు అందుబాటులో ఉంటారని ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
కృష్ణానది ముంపు గ్రామాల్లో అధికారుల పర్యవేక్షణ - Supervision of officials in Krishna Nadi Mumpu villages
కర్ణాటక నుంచి వస్తున్న వరదతోపాటు భీమా నది నీరు కలవటంతో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. ముంపునకు గురి కానున్న 9 గ్రామాల్లో అధికారులు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు.

Supervision of officials in Krishna Nadi Mumpu villages
కృష్ణానది ముంపు గ్రామాల్లో అధికారుల పర్యవేక్షణ
ఇవీ చూడండి: జూరాలలో కృష్ణమ్మ పరవళ్లు... పోటెత్తిన సందర్శకులు