మహిళలకు చేయూతగా 'నీ నేస్తం' - sp_chetana_about_ni_nestam
మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు నిరాకరిస్తున్నారని... అలాంటి వారు బయటకు వెళ్లకుండా నేరుగా తమ సమస్యలను ఫిర్యాదు చేసే విధంగా 'నీ నేస్తం' అనే వినూత్న కార్యక్రమానికి ఎస్పీ చేతన శ్రీకారం చుట్టారు.
నారాయణపేట జిల్లాలో మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎస్పీ డాక్టర్ చేతన 'నీ నేస్తం' అనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు ఎన్ని సమస్యలు ఉన్నా తమలోనే దాచుకొని సతమవుతున్నారని చేతన తెలిపారు. అలాంటివారిని స్వయంగా కదిలించినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పేవారు కానీ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయారని వెల్లడించారు. ఈ ఘటనల దృష్ట్యా 'నీ నేస్తం' అనే ఓ బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో ఎవరైనా తమ సమస్య గురించి ఒక పేపర్‌పై రాసి... బాక్స్‌లో వేస్తే సరాసరి తన వద్దకు వస్తుందని పేర్కొన్నారు. నీ నేస్తం బాక్స్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా భావించి వాటిలో తమ సమస్యను నిర్భయంగా రాసి తమకున్న ఇబ్బందులు తొలగించుకోవచ్చని ఎస్పీ చేతన తెలిపారు.